Paaruvella Srinivas Reddy Poems

Paaruvella Srinivas Reddy Poems

1Telugu Poem As You Like
2Telugu Poem Believe Me
3Telugu Poem Footprints In The Sand
4Telugu Poem అంతా అయిపోయాక
5Telugu Poem అంతే
6Telugu Poem అక్షరం
7Telugu Poem అజ్నబీ
8Telugu Poem అడుగులు
9Telugu Poem అద్దం
10Telugu Poem అమృతం
11Telugu Poem అర్థాంతరంగా
12Telugu Poem అవునా
13Telugu Poem ఆనందం
14Telugu Poem ఇంకా ఏదో మిగిలే ఉంది
15Telugu Poem ఇంకా వుంది
16Telugu Poem ఇంద్రధనుస్సు
17Telugu Poem ఇక సెలవంటూ...
18Telugu Poem ఇద్దరం
19Telugu Poem ఉదయం
20Telugu Poem ఉప్పు నీళ్ళ సాక్షిగా
21Telugu Poem ఎప్పటికీ
22Telugu Poem ఎప్పటిలాగే
23Telugu Poem ఏది నీది
24Telugu Poem ఒక పరిశీలన
25Telugu Poem కరిగి పోతావా కల ఉదయాన్ని పిలిచి
26Telugu Poem కళలింతే..కలలంతే....
27Telugu Poem కాగితం పడవ
28Telugu Poem కొత్తగా
29Telugu Poem కొన్ని జిందగీలంతే
30Telugu Poem గాలి మువ్వల చప్పుడై
31Telugu Poem గులకరాళ్ళు
32Telugu Poem గోస
33Telugu Poem చరిత్ర
34Telugu Poem చివరి మాట
35Telugu Poem చీకటే చెప్పింది
36Telugu Poem చెప్పకుండా
37Telugu Poem తడి లేని ప్రవాహం
38Telugu Poem తనివితీరని పయనంలో
39Telugu Poem తప్పుగా అనుకోవద్దు
40Telugu Poem తవిక
41Telugu Poem తూకపురాళ్ళు
42Telugu Poem తెర తొలగిన వేళ
43Telugu Poem దర్ద్
44Telugu Poem దూరాలు
45Telugu Poem ద్విముఖాలు
46Telugu Poem నడక మొదలయ్యాక
47Telugu Poem నవ్వుతున్నావా
48Telugu Poem నిజం
49Telugu Poem నిత్య నూతనం
50Telugu Poem నువ్వు ఇంకేదైనా మరిచిపోయావా

Best Poem of Paaruvella Srinivas Reddy

Telugu Poem ఇంకా వుంది
*ఇంకా వుంది*

1
ఎన్ని దేహాలు
విడిచి వచ్చిందో
ఎన్ని దారులు
తిరిగి వచ్చిందో
ఇప్పుడు నేను మోస్తున్న ఆత్మ

2
వాలిపోతున్న పొద్దు
రేపు మళ్ళీ పూస్తానన్నది
పగలంతా కళ్ళల్లో విత్తనాలు చల్లి
ఈ రాతిరి మళ్ళీ కలలు కనమన్నది

3
సముద్రం ఇప్పుడే ఇంకిపోదు
నువ్వూ
నేనూ
ఇంకా బతికే వున్నాం
దుఃఖం ఇంకా మిగిలే వుంది

*పారువెల్ల*
25-11-2016
. . .
Read the full of Telugu Poem ఇంకా వుంది
Telugu Poem ఇంకా ఏదో మిగిలే ఉంది
* ఇంకా ఏదో మిగిలే ఉంది *

మూల్గుతూ
ఆయాసపడుతూ
పారిపోతున్న గాలి

దారిని కప్పేసిన పొడవైన చీకటి
నిశ్చలనమై
నిదురలోకి జారుకున్న అడుగులు

పసరు మందు పూయలేని లోతుల్లో
ఓ గాయం
పడమటి పొద్దులా వెలుగుతూ

అప్పుడప్పుడు
వినిపించడానికో కనిపించడానికో
నింగి నేల మధ్య ఊగిసలాడుతూ
మొహమాటపడుతున్న కొన్ని నిజాలు

"ఎవరక్కడ? "
ఓ శాసనం ఉరిమినట్లు మెరిసింది

దిక్కులన్నీ ఏకమయ్యాయి!
"ఎవరూ లేరిక్కడ
ఉన్నవాళ్ళు
ఉండాల్సినవాళ్ళు
అందరూ సమాధుల్లోనే

అనుభవించడానికి
ఆస్వాదించడానికి
ఏవీ లేవిక్కడ
అన్నీ సమాధుల్లోనే "

సమాధులింకా బతికే ఉన్నాయి
ఇంకా ఏదో మిగిలే ఉంది!
. . .
Read the full of Telugu Poem ఇంకా ఏదో మిగిలే ఉంది